
.మన ధ్యాస, నెల్లూరు. ఏప్రిల్ 26:నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామ్ హోటల్ నందు ఆదివారం ఆర్ పి ఐ(అంబేద్కర్) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.పి.ఐ(అంబేద్కర్) పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి.అంజయ్య, రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....... ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వయంగా వ్యవస్థీకరించిన పార్టీ ఆర్ పి ఐ పార్టీ అని తెలిపారు. అటువంటి మహా మేధావి ఏర్పాటుచేసిన ఆర్ పి ఐ (అంబేద్కర్ )పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలోని నూతన కార్యవర్గం ఏర్పాటుతోపాటు పార్టీ బలోపేతానికి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ పిలుపు మేరకు దళిత బహుజనులు రాజ్యాధికారం సాధనకై తమ వంతు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ లో కార్యదర్శి మత్తె బాబి, జిల్లా అధ్యక్షులు షేక్.మాబు తదితరులు పాల్గొన్నారు.
