
మన ధ్యాస,నిజాంసాగర్ :( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలం లోని హసన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివా
రం బోనాల పండు గను గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామమంతా పం డుగ వాతావ రణంలో మునిగిపోయింది. సంప్రదాయ దుస్తు ల్లో అలంకరించిన మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ డప్పుల మోగింపులతో ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు పొందారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగను విజయవంతం చేశారు.పెద్దమ్మ తల్లి కటాక్షం తో గ్రామంలో శాంతి, ఐశ్వర్యాలు నెలకొనాలని భక్తులు ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిన్ కుమార్, పెద్దలు కొరబోయిని భూమయ్య, బోట్ల కిష్టయ్య, బోయిని సాయిలు, ద్యమగారి సాయి లు, గారబోయిన సాయిరాం, ద్యమగారి నర్సిం లు, ద్యమగారి గంగారాం, మహిళలు, గ్రామ స్తులు పాల్గొన్నారు.