మన న్యూస్: పినపాక, దానధర్మ టెస్టు చైర్మన్ గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట ముత్యాలమ్మ వారి బోనాలు నిర్వహించినట్లు గంట రాధా తెలిపారు. ఆదివారం పినపాక మండలం మద్దులగూడెం లో వేద పండితుల మధ్య ముత్యాలమ్మ పోతురాజు బొడ్రాయి నాగులమ్మ, ఆంజనేయుల వారి విగ్రహ ప్రతిష్ట 12 13 14 తేదీలలో నిర్వహించారు. ముత్యాల మ్మ వారి బోనాలు సందర్భంగా అమ్మవారికి ఘనంగా బోనాలు అర్పించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్న గంట రాధా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించారు. ఆకలితో అలమటించే వారికి మెతకై, చలితో బాధపడే వారికి దుప్పట్లను అందిస్తూ పలువురు ప్రశంసలు పొందిన గంట రాధా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితులు శ్యామ్ ఆచార్యులు పవన్ ఆచార్యులు గ్రామస్తులు సహకరించిన పెద్దలకు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.