
కలిగిరి ఏప్రిల్ 21 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
మంగళవారం ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లో కలిగిరి టౌన్ నందు టిడిపి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ వారి కంటి వైద్య శిబిరరాన్ని కలిగిరి ఆర్టిసి బస్టాండ్ సమీపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర ఉండి వచ్చిన పేసెంట్ లకు కంటి పరీక్షలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతో మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి వారికి కంటి అద్దాలు మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అని ప్రతివక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా వి పి పి ఆర్ కంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. వి పిఆర్ నేత్ర బండి వల్ల గ్రామాలలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు . రాష్ట్రంలో ఎన్నడు లేనివిధంగా ఎవ్వరు చేయని విధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు, అని ఈయన పేదల పాటి పెన్నిధిగా పనిచేస్తున్నారని అన్నారు.కలిగిరి గ్రామ పంచాయతీ కీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆనంద వ్యక్తం చెందారు.అదేవిదంగా కలిగిరి గ్రామ ప్రజలకు ఈ అవకాశం కల్పించిన మన నాయకులు ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులైన కాకర్ల సురేష్,కి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి వృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు, ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొప్పులు కొండలరావు, ఉషా మాల్యాద్రి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ సురేష్, చెరెడ్డి సుబ్బారెడ్డి, ప్రభాకర్ రావు, తదితరు టిడిపి నాయకులు కార్యకర్తలు విపిఆర్ నేత్ర ద్వారా కంటి పరీక్షలు చేయించుకొనుటకు వచ్చిన పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు.
