
. మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 18 : నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జిపిఆర్ కళ్యాణమండపంలో శని వారం నిర్వాహకులు ఏర్పాటు చేయబడిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను సందర్శించి ఆదరించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సతీమణి కోటంరెడ్డి సుజితా రెడ్డి పిలుపునిచ్చారు. ఎక్స్పో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... చేనేత కళాకారులు మధునాతన కళా నైపుణ్యంతో రూపొందించిన వివిధ వస్త్రాలను సింహపురి మహిళలు కొనుగోలు చేసి భారతీయ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 23 వరకు నిర్వహించనున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో పోచంపల్లి, గద్వాల్, కలంకారి, కాంచీపురం, వెంకటగిరి, ఉప్పాడ తదితర ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు ఏర్పాటు చేయబడిన గ్యాలరీలను సందర్శించి తమకు ఇష్టమైన వస్త్రాలను కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు వై శ్రీనివాసరావు మాట్లాడుతూ.భారత ప్రభుత్వ హోలీ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేటి నుండి ఈనెల 23 వరకు నిర్వహించనున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో లో మహిళలకు అధునాతనమైన వివిధ వస్త్రాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అవకాశాన్ని సింహపురి మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.







