
తిరుపతి రూరల్, 15:- తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం 97.5% ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ టి.ఎన్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
ఫస్ట్ ఇయర్ (MPC విభాగం): 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన సి. సమ్యుక్త కళాశాల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు 465కు పైగా మార్కులు సాధించి మెరిటస్ అకాడమీ ప్రతిష్టను మరింత పెంచారు.
ఫస్ట్ ఇయర్ (BiPC విభాగం): 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన ఎం. రమ్యసాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 449 మార్కులతో కె. నిఖిత రాణి రెండవ స్థానాన్ని దక్కించుకుంది.ఇతర విద్యార్థులు కూడా 440 నుండి 448 మధ్య మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు.
సెకండ్ ఇయర్ ఫలితాలు: 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన ఏ. నూర్ మెహిన్ అద్భుత ప్రతిభను కనబరిచింది.989 మార్కులతో షేక్ తమన్నా తదుపరి స్థానంలో నిలిచింది.ఇతర విద్యార్థుల్లో కూడా చాలామంది 98%కు పైగా మార్కులు సాధించడం విశేషం.
ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నూతన బోధనా విధానాలు, సమయానుకూల పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలు ఈ విజయానికి పునాది వేశాయని తెలిపారు.
అదేవిధంగా, మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని డైరెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.