
సామాన్య కుటుంబంలో పుట్టి… గోల్డ్ మెడల్ తో డాక్టర్ పట్టా అందుకున్న చరితా రెడ్డి
MANA DHYASA :- ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తన అద్భుతమైన పట్టుదల.. ప్రతిభతో వైద్య విద్యలో చెరగని ముద్ర వేసింది ఆ యువ వైద్యురాలు. తాజాగా మంగళవారం రాత్రి స్విమ్స్ ఆడిటోరియంలో జరిగిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని గోల్డ్ మెడల్ తో డాక్టర్ పట్టా అందుకుంది. వివరాల్లోకెళితే తిరుపతి మంగళం రోడ్డులోని రెడ్డిగుంటలో నివసిస్తున్న కంజుల జగన్మోహన్ రెడ్డి, దేవి దంపతుల కుమార్తె కంజుల చరితారెడ్డి 2020 సంవత్సరం నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఉచిత సీటు పొందింది. అప్పటినుండి అన్నింటిలో ప్రథమ శ్రేణిలో పయనిస్తూ చివరగా ఎంబిబిఎస్ డిగ్రీని గోల్డ్ మెడల్ తో అందుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. తండ్రి జగన్మోహన్ రెడ్డికి తిరుమలలో ఒక చిన్న షాపు ఉంది. అందులో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె ప్రతిభకు అధ్యాపకులు, బంధువులు మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో వైద్య విద్యలో మరిన్ని మెడల్స్ అందుకుని, నిరుపేదలకు వైద్యం అందించేందుకు సంసిద్ధం కావాలని ఆకాంక్షించారు.

