
కలిగిరి ఏప్రిల్ 08 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి ఎంపీడీవో కార్యాలయం కి ప్రమోషన్ లో కొత్త గా డిప్యూటీ ఎంపీడీవో గా వచ్చిన కోప్పోలు రామారావు ఈయన గతంలో వింజమూరు లో గ్రేడ్ వన్ పంచాయత సెక్రటరీగా విధులు నిర్వహించి ప్రమోషన్లు భాగంగా కలిగిరి డిప్యూటీ ఎంపీడీవో గా రావడం జరిగింది. ఈయనను కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు, ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు సూచనలు ఇవ్వడం జరిగింది . ప్రజల కు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు మీ సమస్యలుగా తీసుకుని ప్రజల కు పనులు చేసి పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రత్యూష ,మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కొప్పులు కొండలరావు, చిన్న అన్నలురు సర్పంచ్ కొండప నాయుడు, పాల్గొన్నారు.