
మన ధ్యాస, నెల్లూరు, ఏప్రేల్ 2 : నెల్లూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం డిసిసి అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ............కాంగ్రెస్ పార్టీ అజెండా ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే, ఇందుకోసం పోరాటం కొనసాగిస్తాం...వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మహానేత మరణానంతరం నాయకత్వ లోపంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించవలిసిన పరిస్థితి ఏర్పడిందని ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం 5 లక్షల కోట్ల రూపాయలు లబ్ది చేకూరే విధంగా విభజన బిల్లులు కాంగ్రెస్ పార్టీ రూపొందించింది అని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్ డి ఏ కూటమి కానీ వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు అని అన్నారు.10 సంవత్సరాలు తర్వాత అమరావతిని రాజధాని గా చేస్తూ ఇప్పుడు చట్టసభల్లో పెట్టడం ఎంతవరకూ సమంజసం, 2014 లో చంద్రబాబు అధికారం లోకి వచ్చినప్పుడు పీఎం నరేంద్ర మోడీ చేత అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసినప్పుడే పార్లమెంటు లో చట్టం చేసి ఉంటే ఈ రోజు అమరావతి భవిష్యత్తు ఇంకోలా ఉండేది,,ఇప్పుడు కూడా రాజధాని బిల్లు పార్లమెంట్ కు వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడుతుంటే ఏపీ కి చెందిన 25 మంది ఎంపీ లు,రాజ్య సభ సభ్యులు మాత్రం తమ నాయకులు చంద్రబాబు కు,జగన్ ను పొగడుతూ కూర్చున్నారు,రాజధాని నిర్మాణం లో కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుంటే వైసీపీ కోర్టుకు వెళ్లకుండా పోరాటం చేయకుండా ఏమి చేస్తుంది అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లో ఉన్న 5 ఏళ్ళ లో శాసన రాజధాని అమరావతి లో ఒక్క ఇటుక రాయి కూడా ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు కొత్తగా జగన్ మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు పేర్లతో మావిగన్ అంటూ రాజధాని విషయం లో మూడు ముక్కలాట ఆడుతున్నాడు...రాజదాని గా అమరావతి వుండాలి,మేము అమరావతి రాజధానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది...జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానుల విషయం లో తాను పంపిన బిల్ పాస్ కాలేదని శాసనమండలి నే రద్దు చేయాలని చూసారు...జగన్ అమరావతిని శాసన రాజధానిగా గుర్తించినప్పుడు ఎందుకని అక్కడ అభివృద్ధి చేయలేదు, కూటమి ప్రభుత్వంలో ఒక్కో స్క్వేర్ ఫీట్ కు భారీగా రేటు పెంచి ఐకానిక్ టవర్లు కడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ అవినీతిపై పోరాటం చేయలేదు జగన్ కూడా ఈ అవినీతి లో జగన్ కు భాగస్వామ్యం ఉందా అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది,, విభజన చట్టంలోని బిల్లు ప్రకారం క్యాపిటల్ కు సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా ఉన్నందువలన 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి లాంటిది, అలాంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కొన్ని నియమాలు పాటిస్తేనే కాలువలకు నీరు కె విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కానీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే ఆంధ్ర ఎంపీలు ఏం చేస్తున్నట్టు.. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుంది, అదే సమయంలో విభజన చట్టంలోని హామీలు అమలు విషయంలో స్పష్టంగా కూటమి ఎంపీలు అందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాలి ఇన్సెంటివ్స్, కడప ఉక్కు పరిశ్రమ, వైజాగ్ రైల్వే జోన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి.. అలా చేయని పక్షంలో ఓటమి ఎంపీల ఇల్లు ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని ఎంపీలు తమ వ్యక్తిగత వ్యాపార అవసరాలకు ఢిల్లీలో ఉన్నారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారా అంటూ కూటమి ఎంపీలపై అలాగే వైసిపి పార్టీ ఓ సిద్ధాంతం లేని పార్టీ అంటూ ఆంధ్రప్రదేశ్ లోని అధికార ప్రతిపక్ష పార్టీలు పై డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
