
కలిగిరి,మార్చ్ 30 మన మన న్యూస్ ప్రతినిధి నాగరాజు,
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తగా సేవలందిస్తున్న వర్ధినేని శ్రీనివాసులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ఆయన సారాయి వ్యతిరేక ఉద్యమ నేత దూబగుంట రోశమ్మ పెద్ద కుమారుడు కావడం గ్రామంలో మరింత విషాదాన్ని నింపింది.ఈ విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గ్రామానికి చేరుకుని, మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాసులు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల టిడిపి కార్యకర్త అని, ఆయన మృతి పార్టీకి కూడా తీరని లోటని తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు.
