
మన ధ్యాస,నిజాంసాగర్ : ( జుక్కల్ ) మత్తడి పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు.మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ గుడి వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేస్తారు.కుస్తీ పోటీలకు మహారాష్ట్ర, నారాయణఖేడ్ ,కర్ణాటక , నుంచి మోరలయోధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు,చిట్ట చివరి కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నర్వ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పిడి రాములు గుప్తా జ్ఞాపకార్థం వారి కుమారుడు రాంప్రసాద్ ఐదు తులాల వెండి కడెం బహుకరించడం జరిగిందని తెలిపారు.గ్రామస్థులు 2000/-రూపాయలు నగదు బహుమతితో సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొట్టం అనుసుజ నరసింహులు,ఉప సర్పంచ్ చింతల దుర్గా నరేష్,గ్రామ పెద్దలు సతీష్ దొర, గొల్ల గోపాల్, చింతల దుర్గ ప్రసాద్, సిరిగిరి గంగారం,చాకలి డాకయ్య, గొల్ల పవన్, గొల్ల బాల్ రాజు, కయితి శీను, కరోబార్ ప్రభాకర్ గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.