
కలిగిరి, మార్చి 29,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె).
కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపు మేరకు పెద్దకొండూరు గ్రామ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, మాజీ సర్పంచ్ మరియు 258 బూత్ ఇంచార్జి మొక్కా హజరత్ రావు, నీటి సంఘ అధ్యక్షుడు డి రమేష్,మన్నెపల్లి వెంకట్రావు, చావా మహేష్, డి వెంకటేశ్వర్లు, కె నారాయణ, డి శివరాం, ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ను ఆవిష్కరించారు.ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్వర్గీయ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసి 44 సంవత్సరాలు అయిన సందర్భంగా టీడీపీ పార్టీ జెండా ను పాల్గొని జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై జై లోకేశ్ బాబు జై జై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపాడు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
