
మన ధ్యాస, నిజాంసాగర్: ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు నిర్వహించబడ్డాయి. గ్రామంలోని రామాలయం వద్ద ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు నారాయణఖేడ్, జహీరాబాద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీల్లో పాల్గొన్నారు.ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీలు రోజంతా ఉత్సాహంగా కొనసాగాయి. పోటీల్లో విజేతలకు ₹100, ₹300, ₹500, ₹2500 వరకు నగదు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ కుస్తీ పోటీలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మంద బలరాం కలిసి నగదు బహుమతులను అందజేశారు.కుస్తీ పోటీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్, చాకలి రమేష్, సంకు సాయిలు, బొడ్డు అంజయ్య, ఎర్రోళ్ల సాయిలు, మంగలి ఎల్లయ్య, గ్రామ పరిపాలన అధికారి సంగమేశ్వర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి తుకారం తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు.