
మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 26 :-పాలకవర్గం పాలన ముగియడంతో పట్టణ క్రమబద్ధీకరణ కసరత్తు మొదలైంది. మున్సిపల్ ప్రత్యేక అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ లో 60 అడుగులు రోడ్లు ఉండాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు గురువారం కసరత్తు మొదలుపెట్టారు. వాస్తవానికి పట్టణంలో వున్న మెయిన్ రోడ్లు 60 అడుగులు ఉండాల్సింది పోయి ఒకచోట 47 లో మరోచోట 35 అడుగులు ఇంకొకచోట 3 అడుగులు ఉన్నాయి. మున్సిపల్ ప్రత్యేక అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న సర్వేలతోపాటు మున్సిపల్ కమిషనర్ టి. రత్నకుమార్ టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు సిబ్బంది రోడ్లపై కట్టిన బిల్డింగ్ లకు మార్కింగ్ వేసారు. దీంతో పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా వులిక్కి పడ్డారు. పాలకవర్గం పాలన ముగిసిన రెండు రోజులు కాకముందే రోడ్ల వైండింగ్ అంటూ మున్సిపల్ అధికారులు మాపై విరుచుకుపడుతున్నారని పలువురు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.
