
ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బలోపేతమే లక్ష్యం -జర్నలిస్టుల సమస్యలపై అలుపెరుగని పోరాటం
తిరుపతి, MANA DHYASA : ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి స్పష్టం చేశారు. గురువారం తిరుపతి నగరంలోని ఆశాజ్యోతి కార్యాలయం నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా కమిటీ సమావేశంను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి సార్ ఆదేశాలను సారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో మీడియా ఫెడరేషన్ అభివృద్ధికి కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో కృషి చేద్దామని తెలిపారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని విచారణ వ్యక్త చేశారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధ్యమని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మీడియ ఫెడరేషన్ మెంబర్షిప్ తదితరాంశాలతో కూడిన సమావేశం ను కమిటీ మెంబర్ల మధ్య ఆహ్లాదకర ఆరోగ్యకర వాతావరణంలో జరిగింది. జిల్లాస్థాయి సమావేశం జరిగి ఏడాదికావస్తున్న తరుణంలో జిల్లాస్థాయి సమావేశం ఏప్రిల్ నెలలో నిర్వహించాలని జిల్లా కమిటీ సభ్యులు తీర్మానించారు. మీటింగ్ ఎక్కడ నిర్వహించాలి అనే అంశాల గురించి సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎఫ్ జిల్లా నాయకులు పరందామారెడ్డి, మనోహర్ రెడ్డి, మునిచంద్రారెడ్డి, జయశంకర్, కళ్యాణ్, రమేష్, సాయి, బిన్ని బాలు, శ్రీకాళహస్తి బాలు, ప్రశాంత్, హిమజ తదితరులు పాల్గొన్నారు.

