
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి లో డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్గా డాక్టర్ యశ్వంత్ రామచంద్ర నియమితులయ్యారు.ఈ నియామకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సహకారంతో వెలువడింది.
ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ దేవి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ యశ్వంత్ రామచంద్ర నియామకానికి ఎల్లారెడ్డి గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ రావు,జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత రావు అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కీలకంగా నిలిచింది.ఈ సందర్భంగా, డాక్టర్ యశ్వంత్ రామచంద్ర డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన మహేష్ కుమార్ గౌడ్ ఏలే మల్లికార్జున్,అలాగే సహకరించిన ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు,తోట లక్ష్మీకాంత రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.