
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మార్చి 25,బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్
యార్డులో బుధవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ దొడ్ల కవిత, మున్సిపల్ చైర్ప ర్సన్ సీమ షెట్కార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో అన్ని మండలాల్లో శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తోందని,రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.క్వింటాల్ కు మద్దతు ధర రూ.5,875 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.విక్రయిం చిన వారం రోజులలో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారని,దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి,కౌన్సిలర్లు గంగాధర్,దర్పల్ కార్తిక, వ్యవసాయాధికారి అమర్ ప్రసాద్,కాంగ్రెస్ నాయకులు సాహిల్ షెట్కార్,ప్రేమ్ కుమార్,రవి పటేల్,తదితరులు పాల్గొన్నారు.