
మన ధ్యాస,నెల్లూరు, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు చాంద్ భాషా పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం, నెల్లూరు జిల్లా శాఖ విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడిగా చాంద్ భాషను నియమిస్తూ... ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయి ప్రసాద్ నియామక పత్రాన్ని అందించినారు. ఈ సందర్భంగా ఎం. సాయి ప్రసాద మాట్లాడుతూ.....రాష్ట్రమంతా బీసీ విద్యార్థుల సమస్యలపై సంఘ పోరాడుతుంది అని అన్నారు అలాగే నెల్లూరు జిల్లా బీసీ సంఘం విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు చాంద్ భాషను నెల్లూరు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడం జరిగింది అని అన్నారు. జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మారిష్ మరియు యువజన విభాగం అధ్యక్షులు సుభాష్ యాదవ్ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది అని అన్నారు.అలాగే నెల్లూరు నెల్లూరు శాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంఘం బలోపేతం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం జిల్లా నాయకులు పలువురు బీసీలు పాల్గొన్నారు.
