
కలిగిరి,మార్చి 19, మన న్యూస్ ప్రతినిధి (నాగరాజు కె).
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్చి 20, 23, 24, తేదీ లలో కలిగిరి మండలం లో విస్తృతంగా పర్యటించనున్నారు.20వ తేదీన నాగిరెడ్డి పాలెం లో చెరువు మరమ్మతులకు శంకుస్థాపన, 23వ తేదీన కుమ్మర కొండూరులో పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 24వ తేదీన గంగిరెడ్డిపాలెంలో, బీడ్జి పనులు సీసీ రోడ్ల పనులు ఆర్ ఎస్ కే భవనం, హెల్త్ సెంటర్ ల ను ఆయన ప్రారంభిచునున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కుటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.