
లెనిన్ నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు.
చిత్తూరు, మన ధ్యాస, మార్చి 18. రిపోర్టర్ కమల్ రెడ్డి.
శ్రీరస్తు !శ్రీరామజయం !!శుభమస్తు !!!శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆశీస్సులతో..శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయములెనిన్నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు.హనుమజ్జయంతి ఆహ్వాన పత్రికభక్తాగ్రేశరులారా !శ్లో॥ నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే। నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే ॥స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం, శుక్లపక్షం పౌర్ణమి తిధి, హస్తా నక్షత్రంతో కూడిన 02-04-2026 వ తేది గురువారము "శ్రీ అభయ ఆంజనేయ స్వామి" దేవాలయము నందు “శ్రీ హనుమజ్జయంతి" వేడుకలు ఘనంగా జరుపబడును.02-04-2026 తేది గురువారం కార్యక్రమములుఉదయం 5.00 గం॥లకుసుప్రభాతంఉదయం 5.30 గం॥లకు| గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రధానమంటపారాధన, గణపతి హోమం, శ్రీసూక్త, పురుషసూక్త, మన్యుసూక్త హోమం, నవగ్రహ హోమం, | మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వినియోగం జరుగును.ఉదయం 8.00 గం॥లకురామకోటి భజనఉదయం 9.00 గం॥లకుమంగళద్రవ్యములతో, ఇక్షురసాభిషేకం (చెరకురసం), పంచామృత అభిషేకం జరుగును.ఉదయం 9.30 గం॥లకు| విశేష అలంకరణ చేసి తీర్థప్రసాద వినియోగం జరుగును.మధ్యాహ్నం 12.00 గం॥లకుఅన్నదాన కార్యక్రమముసాయంత్రం 6.00 గం॥లకుశ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవముగా జరుగును.రాత్రి 7.00 గం॥లకు| సరకల్లు టి. రాజేంద్రన్ బృందం వారిచే కోలాటం నిర్వహించబడును.రాత్రి 8.00 గం||లకు| అన్నదాన కార్యక్రమముకావున భక్తాదులెల్లరు విచ్చేసి పై కార్యక్రమములో పాల్గొని " శ్రీ అభయ ఆంజనేయ స్వామి" వారి కరుణాకటాక్షములు పొంది తీర్థప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు.