
కొండాపురం, మార్చి 16,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సత్యవోలు గ్రామం లో ఇటీవల సామాజిక మాధ్యమంలో ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ కి సత్యవోలు గ్రామానికి చెందిన మల్లిబోయిన రవి కుమార్ కుడి చెయ్యి పనిచేయడం లేదు మీ ట్రస్ట్ ద్వారా నాకు ఆర్థిక సాయం చేయమని కోరాడు.వెంటనే స్పందించి విషయం తెలుసుకుని ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు కీ తెలుజేయగా సోమవారం ట్రస్ట్ సభ్యులను రవి ఇంటికి పంపించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రవి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఎలాంటి ఆఫదలు ఉన్న వెంటనే మాకు తెలియజేయండి, కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ మీకు తోడు ఉంటుంది అని ఆయన తెలిజేశారు. అంతే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న ట్రస్ట్ ను సంప్రదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు దేవినేని వెంకట సుబ్బయ్య , చెరుకూరి శేషయ్య , కృష్ణమోహన్ చౌదరి, కోడె వెంకటేశ్వర్లు , సత్యావోలు గ్రామ టీడీపీ నాయకులు ముత్యం వేణు, పెద్దపాటి మలకొండయ్య,డేగ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.