
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని,ఈ నెలలో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించుకోవడం ముఖ్యమన్నారు.ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.పిట్లం,నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలాలకు చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యేతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కుమ్మరి శేఖర్ జుక్కల్ నియోజకవర్గం అధ్యక్షులు అబ్దుల్ హిమ్రజ్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.