
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )
ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయని
సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా దుస్తులను నిరుపేదలకు సర్పంచ్ హరిన్ కుమార్, మైనార్టీ నాయకులు మౌలానా షరీఫ్ లు కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందించడం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ తోఫా పంపిణీ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు నాయకులు మహబూబ్,అన్వర్,తదితరులు ఉన్నారు.