
కలిగిరి, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కలిగిరి మండలం లో సోమవారం నుండీ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులకు కలిగిరి మండల తెలుగుదేశం అధ్యక్షులు పూసల వెంగపనాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లకు లోను కాకుండా పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష సమయానికి 30 నిముషాలు ముందుగా పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష నిర్వాహకులు కూడా వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి అంకితభావంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచి ముందుగానే బయలుదేరి పరీక్షా కేంద్రంకు చేరుకోవాలన్నారు.