మన న్యూస్: మణుగూరు కరకగూడెం మండలానికి చెందిన లబ్ధిదారులు నలుగురు మహిళలకు మెడి పార్వతి, గోగు గోపమ్మ , గోగు రమణ అనే మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా కరక గూడెం గ్రామానికి చెందిన కొమరం సత్యనారాయణ, రవీందర్ కు దివ్యాంగు అభివృద్ధి కోసం 50వేల రూపాయల చెక్కును అందజేశారు. పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి కి 50 వేల రూపాయలు, గోపాలరావుపేట గ్రామానికి చెందిన వి .కల్పన కు 50వేల రూపాయల చెక్కు మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల అభివృద్ధి కోసం మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు ప్రజాభవన్ లో శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, పార్టీ నాయకులు కొంపెల్లి నాగేష్, కరక గూడెం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు యర్రా సురేష్, జలగం కృష్ణ, మండల వికలాంగుల నాయకులు జాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.