
మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మండల తెలుగు యువత ప్రచార కార్యదర్శి మారినేని రామకృష్ణ
ఉదయగిరి మార్చి 11, ఎల్లో సింగం ప్రతినిధి, నాగరాజు కె.

ఉదయగిరి మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించినటువంటి ఆర్వో వాటర్ ప్లాంట్ శుభమస్తు ఫౌండేషన్ సౌజన్యంతో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఉదయగిరి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం జరిగినటువంటి సమావేశంలో వరికుంటపాడు మాజీ మండల తెలుగు యువత ప్రచార కార్యదర్శి మారినేని రామకృష్ణ పాల్గొని మర్యాదపూర్వకంగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.అనంతరం నెల్లూరు నుండి వింజమూరు వయా చాకలకొండ మీదగా పామూరు రవాణా సౌకర్యం లేక సుమారు పది గ్రామాల ప్రజలు ప్రయాణికులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వైద్య చికిత్స కోసం, వివిధ కార్యాలయాల వెళ్ళుటకు , వివిధ పనుల కోసం వెళ్లేవారు, విద్యార్థులు ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది వివిధ పనుల కోసం బ్రతుకుతెరువు కోసం వెళ్లేవారు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ విషయంపై స్పందిస్తూ ఏపీఎస్ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సర్వీసును పూర్తిస్థాయిలో 10 గ్రామాల ప్రజలకు అందించేందుకు ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకొని ప్రజలకు ప్రమాణ సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి మండల అధ్యక్షులు బయన్న యాదవ్, కలిగిరి సొసైటీ అధ్యక్షులు కదిరి రంగారావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు , వరికుంటపాడు మండల బిజెపి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, చుండి హరి గోపాల్ రెడ్డి, కృష్ణా, రోశయ్య తదితర మండల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
