
కొండాపురం, మార్చి 11,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె).

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం లోని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నందు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ట్రస్ట్ సభ్యులు పాల్గొని పలు సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది.అనంతరం ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు వివిధ ప్రాంతాల నుంచి ప్రశంసలు అందుతున్నాయని ట్రస్ట్ చైర్మన్ వెంకటాద్రి నాయుడు సభ్యులకు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.సమావేశం ముఖ్య అంశాలు,,రానున్న రోజుల్లో అనేకమైన వినూత్న కార్యక్రమాలతో ప్రజలలో ట్రస్టు ఉండాలని ఆమోదించారు.ట్రస్ట్ కార్యాలయాన్ని ఎవరు సంప్రదించిన ట్రస్ట్ సభ్యులందరూ వెంటనే స్పందించాలని తెలియజేశారు.మత బీద విభేదాలకు తావు లేకుండా అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడేలా ట్రస్ట్ సభ్యులందరూ కూడా వ్యవహరించాలని ఆమోదించారు.వ్యవసాయానికి కావాల్సిన పరికరాలను కూడా అందించాలని ఆమోదించారు .
బ్లడ్ క్యాంపులు, కంటి వైద్యశాలలో కూడా నిర్వహిస్తామని తెలిపారు.మరీ ముఖ్యంగా ట్రస్ట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ట్రస్ట్ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి వక్కరికి ధన్యవాదాలు,తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
