
చిత్తూరు ,మన ధ్యాస, మార్చ్ 8
ఆదివారం ఉదయం 9 గంటలకు , చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గురించి, మరియు ప్రియాంక గాంధీ గురించి ,సోనియా గాంధీ గురించి, అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గురించి, తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ జరిగింది .జిల్లా కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. వికారాబాద్ లో జరిగిన డీసీసీల ట్రైనింగ్ క్యాంప్ గురించి తెలియజేయడం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, మండల కమిటీల్ని, గ్రామ కమిటీలు ,అలాగే బూత్ స్థాయి కమిటీలు, త్వరగా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది జరిగింది.చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షులు డి రమేష్ బాబు మరియు చిత్తూరు అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కీ రాయల్, మరియు చంద్రగిరి నగరి పూతలపట్టు కోఆర్డినేటర్లు పూతలపట్టు ప్రభా కర్,
ఐరాల లోకేష్ రెడ్డి, కార్తీక్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బండ్ల సుబ్బరాయులు కే కే సి అధ్యక్షుడు భాగ్య రాజ్, అలాగే కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు