మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో ఉన్న దళిత వాడలో పైగేరిలో ఉన్న చేతి బోరు హెడ్ పూర్తిగా విరిగి పోవడంతో 6 నెలల పాటు ఉపయోగంలో లేదు అలాగే క్రింది గేరిలో ఉన్న చేతి బోరు పంపు పైపులకు రంధ్రాలు పడటంతో నీలు రానందున ఈ కాలనీ వాసులు త్రాగడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇదే గ్రామానికిచెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు శాంతకుమార్ బోరెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి నీటి సమస్యపైన ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వగా వెంటనే అడిషనల్ కలెక్టర్ DPO తో చర్చించడం జరిగింది. మండల MPDO , పంచాయతి కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ రోజు చేతి బోరు పంపులు రిపేర్ చేపించడం జరిగింది. త్రాగు నీటి సమస్యను తీర్చిన సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ DPO దళిత వాడ ప్రజలు సంతోషం వ్యక్తపరిచి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నీటి సమస్యను ప్రజావాణి దృష్టికి తీసుకెళ్లిన సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ మండల ఎంపీడీవో గ్రామపంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్అ భినందనలుతెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు