మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు :
కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన మంగలి సురేష్ కుమార్,పుష్పావతి దంపతుల కుమార్తె చిన్నారి పునర్విక స్ఫైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడటంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చిన్నారి పునర్విక ప్రాణాన్ని కాపాడడానికి ఎవరికి వారే పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు.అందులో భాగంగా పునర్వికకు వైద్య ఖర్చులు నిమిత్తం ప్రత్తిపాడు అఖిల్ స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో చలించిపోయి రూ.30000 అందించి విద్యార్థులు ఉదారత చాటుకున్నారు.ఈ సందర్భంగా చిన్నారి పునర్విక ప్రాణాన్ని కాపాడడానికి మేము సైతం అంటూ ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన విద్యార్థులు,ఉపాధ్యాయులని చైర్మన్ ఇనకోటి గంగాధర్ అభినందించారు.