
చిత్తూరు ఫిబ్రవరి 21 మన ద్యాస
చిత్తూరు జిల్లా కేంద్రంలోని చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, సంజయ్ గాంధీ నగర్ చిత్తూరు నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం చిత్తూరు నందు స్థానిక సంజయ్ గాంధీ నగర్ లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రిన్సిపాల్ టిష్యా ప్రసాద్, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రచయితల సంఘం ప్రముఖ రచయిత్రి ఎం.ఆర్ అరుణకుమారి, ప్రధాన కార్యదర్శి రంగాని సహదేవ నాయుడు, కార్యవర్గ సభ్యులు ఎడ్ల బాలకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి రచయిత్రి ఎం.ఆర్.అరుణ్ కుమారి మాట్లాడుతూ మాతృభాష తోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి, మూలమని ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశాలు మాతృభాషలోనే బోధన జరగాలని సెకండరీ విద్యా స్థాయిలో తప్పనిసరిగా తెలుగు పాఠ్యాంశం ఉండేటట్లు చూడాలని అలాగే ప్రభుత్వ పాలన వ్యవహారాలు, తెలుగు భాషలోనే కొనసాగే విధంగా చూడాలని, పామరులు సైతం అవగాహన చెందుతారని కావున మాతృభాష పరిరక్షణకు పదికాలాలు, పదిలంగా ఉండేటట్లు బావి భవిష్యత్ తరాలకు, అందించే విధంగా తల్లిదండ్రులు రచయితలు, మేధావులు, పాలకులు సమిష్టిగా బాధ్యతగా కృషి చేయాల్సిన నేటి అవసరం ఉందని తెలిపారు. అనంతరం యునెస్కో వారి ఆదేశాలతో ఫిబ్రవరి 21-2000 నుండి ఆయా భాషల ప్రజలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా నిర్వహించుకోవడం కొనసాగుతున్నదని అందులో భాగంగా నేడు గిరిజన గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థినుల మధ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం వీటిలో బాలికలు భాగస్వాములై మాతృభాష వైభవాన్ని విశిష్టతను,తెలిపే విధంగా పాటలు, పద్యాలు, మరియు మాటల ద్వారా తెలపడం గొప్ప విషయమని తెలిపారు. అలాగే మాతృభాష విశిష్టతను తెలిపే గేయం కవితను ప్రధాన కార్యదర్శి సహదేవ నాయుడు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎడ్ల బాలకృష్ణారెడ్డి పద్మనాభ పెళ్లై, అనంత కుమార్, మాట్లాడుతూ మాతృభాషను భవిష్యత్తు, తరాలకు పదిలపరచడానికి తల్లిదండ్రులు మరియు నేటి యువతరం పైన ఉందని మాతృభాషను మరవకూడదని తెలిపారు. మాతృభాష పైన పాటలు పాడిన బాలికలను నగదు రూపంలో బహుమతి అందించి ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనజ, మంజునాథ్, ప్రణవిక శ్వేత, సత్తార్ ఖాన్, లావణ్య, అనసూయ, హేమలత మరియు పాఠశాల బాలికలు పాల్గొనడం జరిగింది.