
కలిగిరి, ఫిబ్రవరి 22,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ).
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పడమర గుడ్లదోన పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న యేగూరి ప్రియాంక ఇటీవల విడుదలైన గ్రూప్ - 2 ఫలితాలలో రాష్ట్ర సచివాలయంలో జిఏడి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏ ఎస్ ఓ) గా ఎంపికైన సందర్భంగా కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ నాయకులు పూసల వెంగపనాయుడు ఆమెను ఘనంగా సన్మానిచ్చి శాలువా తో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముందు ముందు రోజుల్లో ఆమె ఇంకా మంచి ఉన్నతమైన గెజిటెడ్ ఆఫీసర్ స్థాయికి ఎదగాలని,దీవించి సంతోషించి ఘనంగా సన్మానించి ప్రశంసించి అభినందించడం జరిగింది.ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావటం విశేషం అని ఆయన అన్నారు. పేద కుటుంబం లో పుట్టి ఉన్నత స్థాయి కీ ఏదిగినందుకు ఆమెకు మరో సారి అభినందనలు తెలిపేరు.ఈ కార్యక్రమం లో ఎమ్ పి డివో ప్రత్యుష,ఎమ్ పి పి మెట్టుకూరి శిరీష,ఎమ్ పి ఢీ ఓ కార్యాలయం సిబ్బంది,మరియు వెలగపాడు సర్పంచ్ వెంకటసుబ్బయ్య.తదితర నాయకులు పాల్గొన్నారు.
