
మన ధ్యాస,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. బిచ్కుంద మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్ని కల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కవాసం చేసుకోవడంతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ సీటును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేను సన్మానించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కుమ్మరి రాములు,గజ్జల జీవన్,బోయిని హరిన్ కుమార్,రపి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తాటిపల్లి సరస్వతి ,గొట్టం నర్సింలు,సాయా గౌడ్, హనుమాన్లు,మోహిన్, జనార్దన్ గౌడ్ తదితరులు ఉన్నారు.