
కొండాపురం,ఫిబ్రవరి 19,మన న్యూస్,(నాగరాజు కె ).
కొండాపురం మండలం మాజీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గుడాల మనోహర్ వివాహ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వరుడు గుడాల మనోహర్‌ను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జీవితంలో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.స్థానిక నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వరుడినీ ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలిపారు
