మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నా కుటుంబ సభ్యుల నుండి నా ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన కిలాడి లీలా మాధురి మీడియా ముందు ఆవేదన వెల్లబుచ్చింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా కుటుంబ సభ్యులు నేను ఎంత చెప్పినా వినకుండా ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారని,నా పెళ్లికి ముందే వేరొక వ్యక్తిని నేను ప్రేమించానని,నన్ను పెళ్లి చేసుకున్న దుర్గాప్రసాద్ కు పెళ్ళికి ముందే నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా నన్ను వివాహం చేసుకున్నాడని తెలిపింది.పెళ్లి జరిగిన తరువాత నన్ను పెళ్లి చేసుకున్న దుర్గాప్రసాద్ నన్ను,మానసికంగా లో,శారీరకంగా హింసిస్తూ,చంపడానికి ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేసింది.తను కట్టిన తాళితో నా మెడకు ఉరి తాడులా బిగించాడని వాపోయింది.తుని సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లి చంపబోయాడని కన్నీటి పర్యంతమైంది.దిక్కు తోచని స్థితిలో ప్రాణ భయంతో నా అంతట నేనే బయటికి వెళ్లిపోయానని,నన్ను ఎవరూ తీసుకెళ్లలేదని మీడియాకి తెలిపింది.నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఇష్టం లేని కాపురం చేయాలని బలవంతం చేస్తున్నారని,దిక్కుతోచని స్థితిలో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో నాకు,నా ప్రాణానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశానని తెలిపింది.నాకు న్యాయం జరిగేలా చూడాలని హోం మంత్రి అనితని కూడా చేతుల జోడించి ప్రార్థిస్తున్నానంటూ మీడియా ముఖంగా కోరింది.