మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: భారతదేశ
కృత్రిమ మేధస్సు (ఏ ఐ) రంగంలో మరో గొప్ప విజయంగా,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా ,ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సంస్థను ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మేటి) మరియు భారత ప్రభుత్వం అధికారికంగా ఏ ఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ఆహ్వానించాయి.యువ ఏ ఐ కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల నుండి 2,500కి పైగా బృందాల్లో పాల్గొనగా వాటిలో స్పార్క్ సంస్థ టాప్ 20 గ్లోబల్ ఫైనల్ లిస్ట్ లో స్పార్క్ ఒకటిగా ఎంపికైంది. అడవులు, వన్యప్రాణులు, గ్రామీణ సముదాయాల సంరక్షణ కోసం రూపొందించిన తమ ఏ ఐ ఆధారిత ప్రాజెక్ట్ వైల్డ్ ట్రాక్ ఏ ఐ తో అనే కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్ట్ ద్వారాఅంతర్జాతీయ గుర్తింపు పొందింది.ఈ ప్రాజెక్ట్ ప్రజాహితానికి వినియోగం అనే భారతదేశ దృష్టితో అనుసంధానమై, సాంకేతిక వినూత్నతను స్థిరత్వం మరియు జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో కలిపి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అక్కడికి వచ్చిన ఏఐ నిపుణులు అందరూ కూడా స్పార్క్ సంస్థను ప్రశంసించారు.ఈ ప్రాజెక్ట్ను స్పార్క్ సంస్థ సీఈఓ సాయి ప్రదీప్ మరియు స్పార్క్ డైరెక్టర్ రమ్యశ్రీ అభివృద్ధి చేశారు.ఈ ఎంపిక భారత యువత ఆధ్వర్యంలో సాగుతున్న ఆవిష్కరణలకు ప్రపంచస్థాయిలో లభించిన గౌరవంగా నిలుస్తోంది. అని గ్రామీణ స్థాయి నుండి గ్లోబల్ స్థాయికి స్పార్క్ చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ వివరించారు.స్పార్క్ సంస్థ సీఈఓ ప్రదీప్ మాట్లాడుతూ గ్లోబల్ స్థాయి వేదికపై మాట్లాడటం అతి చిన్న వయసుకుడుగా నాకు దక్కిన చాలా గొప్ప అవకాశం నేను ఎప్పటికీ మర్చిపోలేంది దీనికి కారణం మా స్పార్క్ సంస్థ టాప్ 20 ఫైనల్ జాబితాలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చిన ఏకైక సంస్థ స్పార్క్ అని తెలిసి మేము చాలా సంతోషంగా ఉన్నాము.భారత ప్రభుత్వం మరియు మేటి నుంచి ఆహ్వానం అందుకోవడం ఇది మా కష్టానికి, స్పార్క్ బృందానికి లభించిన ప్రతిఫలం అని నేను భావిస్తున్నాను అని అన్నారు. సాయి ప్రదీప్ ను వివిధ ప్రముఖ దేశాల నుండి వచ్చిన ఎండీలు మరియు సీఈఓలు ప్రముఖ కంపెనీ ఏఐ నిపుణులు ప్రశంసించారు. కొన్ని సంస్థలు ఈ ప్రాజెక్ట్ ని వారి ప్రముఖ సంస్థల్లో కూడా వినియోగించడం కోసం స్పార్క్ తో ఎం.యు కూడా చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి అని చెప్పారు.ఈ విషయం తెలియగానే స్పార్క్ సంస్థను వివిధ ప్రతినిధులు అభినందించారు.