
తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ద్యాస
తవణంపల్లి మండలం దిగువమాఘం అమరరాజ స్కూల్లో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్ పరిశీలించి, భద్రతా ఏర్పాట్లు మరియు పరీక్షల నిర్వహణను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.పరీక్షలు సజావుగా సాగేందుకు పాఠశాల యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.