మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: హిందువులకు ముస్లింలు అన్నదానం చేయడం అనేది ఒక మత సామరస్యాన్ని, సహకారాన్ని పెంచే గొప్ప విషయం. భారతదేశంలో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సంప్రదాయం హిందూ, ముస్లిం మతాల మధ్య ఐక్యత, ప్రేమను చాటిచెబుతుంది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు. మతాలు వేరయినా దేవుడు ఒక్కడే. పూజించే విధానం వేరైనా ప్రార్థన ఒక్కటే.ఎవరు తిన్నా ఆ అన్నమే. ఎవరు తాగినా ఆ నీళ్లే. మంచి మనసు ఉండాలి కానీ. స్వీకరించే మనస్సులు చాలా ఉన్నాయని నిరూపించిన ఘటన ఇది. ఏలేశ్వరం పట్టణంలో జరిగిన ఈ విశేషం. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం పట్టణంలో భక్తులకు పట్టణంలోని ముస్లిం సోదరుడు ప్రసాదం ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి కి వచ్చే
భక్తులకు అన్న ప్రసాదం అందించి గొప్ప మనస్సు చాటుకున్నారు. ముస్లిం సోదరులు భక్తులు స్వీకరిస్తే సాక్షాత్తు పరమశివుడు తీసుకున్నట్లుగా సంతోషిస్తున్నారు.ముస్లిం సోదరులు భక్తుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేశారు. ఎంతో నిష్ఠగా దగ్గరుండి అన్ని తయారు చేయించారు. ఎవరి భక్తి వాళ్లకు గొప్పగా ఉంటుంది. ఆ దేవుడు అందరికీ వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారని. ఎవరి నమ్మకం వాళ్లది అని చెప్పుకొచ్చారు.హిందూ ముస్లింలు అనే బేధం మనం ధరించే వేషానికే తప్ప, మనసుకు కాదని. అందరం ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడేనని. శివరాత్రి రోజు భక్తులకు సేవ చేయడం సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులను ఆశీర్వదించారు. పట్టణంలో ఇలాంటి మంచి వాతావరణం ఎల్లప్పుడూ ఉండాలంటూ ఏలేశ్వరం పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.