మన న్యూస్ శ్రీకాళహస్తి డిసెంబర్ 13 :
తిరుపతికి చెందిన కొత్తపల్లి బాలకృష్ణమ నాయుడు, పోలవరం వెంకట రమణయ్య నాయుడు, వంశీ కృష్ణమ నాయుడు, మద్దు మనోహర్ యాదవ్ లు శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ఊరందూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించుకున్నారు. ఇది పేద ప్రజల ప్రభుత్వమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొంటూ ఎల్లవేళలా నిరుపేదలకు అందుబాటులో ఉంటామని నిస్పక్షపాతంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు.