
దుత్తలూరు,మన న్యూస్, ఫిబ్రవరి 15,(నాగరాజు కె )

దుత్తలూరు మండలం దుత్తలూరు గ్రామానికి నైరుతి దిక్కున కొండపై వెలసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివపార్వతుల కళ్యాణంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అంతకముందు ఆలయ ధర్మకర్త మండలి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి దంపతులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ఘన స్వాగతం పలికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆశీస్సులు అందించారు. అనంతరం పరిసర ప్రాంతాలలో తిరిగి పుణ్యక్షేత్రం విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ మహా శివుని ఆశీస్సులు అందరు పైన ఉండాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్, మరియు ఆయన కుటుంబం తరపున నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివుని కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తోపాటు మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, మండల నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.
