
మహాశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి.మహాశివరాత్రి ఏర్పాట్లు పట్ల హర్షం.. అన్న ప్రసాదాలు వడ్డించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
సీతారాంపురం, మన న్యూస్ ఫిబ్రవరి 15,(నాగరాజు కె).

మహా శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదివారం ఘటిక సిద్దేశ్వరం లో శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, అన్నపూర్ణాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి జాగారానికి వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లు పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా అన్న ప్రసాదాలు వడ్డించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు నాయకులు పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శివపార్వతుల కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు.
