
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన నిజాంసాగర్ పోలీసులను జిల్లా ఎస్పీ రాజచంద్ర అభినందించారు కేసు వివరాలు ఎలా ఉన్నాయి.పిర్యాదిదారుడు కేతావత్ పరుశురాం (27), అయ్యపల్లి తండా వాసి, ప్రస్తుతం పిప్పిరియగడి తండాలో నివసిస్తున్నాడు.
హసన్ పల్లి శివారులోని 1 ఎకరం 20 గుంటల భూమిని కురుమ భూమయ్య వద్ద కొనుగోలు చేసి,కొంత డబ్బులు చెల్లించి,మిగిలిన మొత్తాన్ని పట్టా అనంతరం చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.ఈ విషయమై 16-07-2021 ఉదయం పిప్పిరియగడి తండా పెద్దమనిషి పిలుపుతో పిర్యాదిదారుడు తన మామతో కలిసి వెళ్లగా, అక్కడ భూమి అమ్మిన కురుమ భూమయ్య అల్లుడు బోయిన ప్రవీణ్ కుమార్ తో పాటు మొతుకుల సంగమేశ్వర్ గౌడ్,కురుమ భద్రయ్యలు కలిసి డబ్బులు వద్దు,మా భూమి మాకు కావాలి అంటూ పిర్యాదిదారుడిని కులం పేరుతో దూషించి నువ్వు ఏ ఊరి వాడివి అంటూ బెదిరించి,చేతులతో మరియు చెప్పులతో దాడి చేశారు.ఇట్టి విషయమై ఫిర్యాదుదారుడు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇట్టి విషయములో కుటుంబ సభ్యులను,కాలనీవాసులను మరియు చుట్టుపక్కల వారిని విచారించి,సరైన సాక్ష్యాలను సేకరించి నిందితులైన A-1: మొతుకుల సంగమేశ్వర్ గౌడ్ తండ్రి: రామ గౌడ్,A-2: బోయిని ప్రవీణ్ తండ్రి సాయిలు A-3 :కురుమ భద్రయ్య తండ్రి లక్ష్మయ్య లను అరెస్టు చేసి,తదుపరి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయడంతో కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం, కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు నేరం రుజువవడంతో,
నిజామాబాద్ గౌరవ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ (SC/ST కోర్ట్) టి. శ్రీనివాస్ నిందితులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసులో పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ శ్రీ ఆర్. దయాకర్ గౌడ్ కేసును సమర్ధవంతంగా దర్యాప్తు చేసిన అప్పటి నిజాంసాగర్ సి ఎచ్ సయ్యద్ అహ్మద్, డీఎస్పీ వి. జైపాల్ రెడ్డి, ప్రస్తుత బాన్స్ వాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి,నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్,కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు ఏఎస్ఐ రాజేశ్వర్,శ్రీనివాస్,సీడీఓ వసీం లను జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అభినందించారు.