
మన ధ్యాస , మనబోలు, ఫిబ్రవరి 12 : ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి నా ఒక్కరి వల్ల కాదు మీరందరూ సహకరిస్తే అది సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా,మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు అక్కంపేట గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో పాల్గొన్నారు.నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి షర్మిల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ..... డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉపాధి హామీ పథకాన్ని సమర్ధంతగా నడిపారు. నేడు అది అదోగ పతి పాలవుతుంది అని అన్నారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్మెంట్, ఉపాధి హామీ పథకం,ఉచిత విద్యుత్తు మొదలగు పథకాలతో రామరాజ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన సాగింది అని అన్నారు. ఉపాధి హామీ పథకంని కాపాడుకోవడానికి నా ఒక్కరి వల్ల కాదు మీరందరూ నాతో సహకరిస్తే ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవచ్చని అని తెలిపారు.నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...... నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాలు ఉన్నాను. ఏనాడు ఏమి ఆశించలేదు కానీ నా ఆశయాన్ని విమర్శించి, తుంగలో తొక్కారు అందుకే అది నచ్చక, సిద్ధాంతాలను నచ్చక నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వచ్చాను అని అన్నారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకై రాజశేఖర్ బిడ్డ షర్మిలమ్మ అక్కంపేట గ్రామానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.ఉపాధి హామీ పథకం కాపాడుకోవాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైనది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే నేడు బిజెపి దాన్ని పూర్తిగా నిర్ధారణ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజులు పని కల్పించాలని చట్టంలో ఉంటే, నేడు 50 రోజులు కూడా పని కల్పించడం లేదు అని తెలిపారు. కనుక ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కనుక అందరూ షర్మిలమ్మకు సహకరిస్తే ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలోఅక్కంపేట గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






