మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం,వూరి వడిని కాపాడుదాం అనే నినాదంతో ప్రచురించిన పోస్టర్లను ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన, అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు నియమించడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాలు నిండిన బాలబాలికులను ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ విషయమే విస్తృత ప్రచారానికి స్వీకారం చుట్టిన యుటిఎఫ్ సంఘాన్ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల లక్ష్మణరావు,కొప్పుల బాబ్జి, ఎంపీడీవో సిహెచ్ రవికుమార్ వర్మ, ఎంఈఓబి అబ్బాయి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జట్ల సోమరాజు, మండల యూనిట్ నాయకులు ఆదివిష్ణు, గణపతి రావు, రాజశేఖర్, రవి, దొర రాంబాబు ఉన్నారు.