
యాదమరి, మనధ్యాస, ఫిబ్రవరి 9 రిపోర్టర్: కమల్ రెడ్డి
చిత్తూరు నగరంలోని మెసానిక్ గ్రౌండ్ వేదికగా ఆదివారం అండర్ -18 స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్లో చిత్తూరు, తిరుపతి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి తదితర ప్రాంతాల నుండి దాదాపు 120మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో పీఈఎస్ పబ్లిక్ పాఠశాలకు చెందిన విద్యార్థులు చేతన్, సాయి ప్రణీశ్వర్, పృథ్వి, జశ్వంత్, కృతిన్, లలిత్ కళ్యాణ్, కిష్వంత్, భవజ్ఞ, ధరణి రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. తమ విద్యార్థులు అండర్ 18 స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ కాంపిటీషన్స్కి ఎంపిక కావడం చాలా గర్వకారణంగా ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వై.వి.కృష్ణబాబు, పిఈటి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. వీరందరూ రాబోయే అండర్ 18 స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ కాంపిటీషన్లో చిత్తూరు జట్టు తరపున పాల్గొంటారని తెలిపారు.