మన న్యూస్: విద్య శాఖ అధికారి బి.వరలక్ష్మి, యు టి ఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎస్ ఎస్ సి 2025 మోడల్ టెస్ట్ పేపర్స్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఐఏఎస్,జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీమతి బి.వరలక్ష్మి ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిష్ణాతులైన సీనియర్ ఉపాధ్యాయుల చే రూపొందించిన7 పేపర్స్ పాట్రన్ & ఎగ్జామ్ ఓరియెంటెడ్ లో రూపొందించిన అన్నీ సబ్జెక్ట్లు4 నాలుగు మోడల్ పేపర్లు మరియు వాటికి జవాబులను తయారు చేశారు, మార్చి17 నుంచి జరిగే కామన్ పరీక్షలు దృష్ట్యా అన్ని స్థాయిల విద్యార్థులకు ఉపయోగపడే మోడల్ టెస్ట్ పేపర్స్.తెలుగు ఇంగ్లీష్ మీడియం లలో తయారు చేశారు వీటిని చిత్తూరు జిల్లా యు టి ఎఫ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఐఏఎస్, డీఈవో బి వరలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ మోడల్ పేపర్లు చదవడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణతకు వారిలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడతాయనీ వీటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయడానికి కృషి చేయడం అభినందనీయమని వారు కొనియాడారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సోమశేఖర్ నాయుడు ఎన్.మణి గండన్స హాధ్యక్షులు కే రెడ్డప్ప నాయుడు, ఎస్ రెహనా బేగం నాయకులు
ఎస్పీ బాషా,డి ఏకాంబరం కే. సరిత ,ఎం పార్థసారథి పి.సి.బాబు, సి .వెంకటేశ్వర రెడ్డి,వంశీకృష్ణ,నాగరాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.