
చిత్తూరు ఫిబ్రవరి 09 మన ద్యాస
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చిత్తూరు జిల్లా కార్యదర్శి గా ఎస్ బాలచంద్ర ని నియమిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీశ్వర నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం యాదవ్ ప్రకటించారు. గతంలో బాలచంద్ర బీజేపీ తవణంపల్లి మండలం ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా బాలచంద్ర మాట్లాడుతూ తాను 15 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో క్రియా శీలంగా ఉన్నానని, తనకి ఏ పదవి ఇచ్చినా దానిని బాధ్యతగా తీసుకుంటానని, తనపై నమ్మకం ఉంచి తనకి ఈ పదవి రావడానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు గారికి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్, నియోజకవర్గం ఇంచార్జ్ భాను ప్రకాష్ గార్లకు కృతజ్ఞతలు తెలుపుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, శక్తి వంచన లేకుండా పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు