
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గులాం సంధాని ని భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని 8 వ వార్డు లో ఆదివారం రాత్రి ప్రజలతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గులాం సంధాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిందని ఆయనను చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మున్సిపాలిటీగా ఏర్పడడంతో కోట్ల రూపాయలతో బిచ్కుంద రూపురేఖలే మారే విధంగా చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బిచ్కుంద మున్సిపాలిటీలో చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గులాం సంధాని చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
