
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 12 వాడు కౌన్సిలర్ అభ్యర్థి సీమా రమేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ముదిరాజ్ సన్మాన కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మోసగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని,మోసపోతే గోసపడుతామని అన్నారు. సీమ రమేష్ షెట్కార్ ను కౌన్సిలర్ ను చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటింటికి చేరుతుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తుందని గుర్తు చేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.