
ఉదయగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 06,(నాగరాజు కె ).
స్టూడెంట్ నే లేదా డాక్టర్... అనుకుంటూన్న ప్రజానీకం.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గండిపాలెం జడ్పీ హైస్కూల్ టీచర్ కే సి మాలకొండయ్యను విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ్ కాపాడిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రార్థన సమయంలో టీచర్ కళ్ళు తిరిగి పడిపోయారు. గమనించిన వెంకట కిరణ్ సిద్ధార్థ్ సిపిఆర్ చేయడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. అనంతరం సిదర్థ మాట్లాడుతూ నేను గతంలో మా నానమ్మకు సిపిఆర్ చేయడంతో బతికేరని,ఆ అనుభవం ఇప్పుడు పనికి వచ్చిందని సిద్దారు చెప్పాడు. విద్యార్థులకు సిపిఆర్ అవగాహన కల్పిస్తే ఇలాగే ఉపయోగపడుతుందని పలువురు అనుకుంటున్నారు.